Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒక్క ప్రకటన.. రూ.68,000 కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఉఫ్‌!

One announcement and Rs 68000 crore investor wealth vanished
Advertisement
  • ఛైర్మన్‌గా కొనసాగబోనన్న ఎన్‌.చంద్రశేఖరన్‌
  • ఆయన నిర్ణయంతో టాటా షేర్లలో భారీ అమ్మకాలు
  • రూ.68,119 కోట్లు తగ్గిన 17 టాటా కంపెనీల మార్కెట్‌ విలువ
  • రూ.42,440 కోట్లు ఆవిరైన టీసీఎస్‌ మార్కెట్‌ విలువ
  • రూ.9,304 కోట్లు కోల్పోయిన టైటన్‌
Advertisement
టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ నిర్ణయం టాటా గ్రూప్‌ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఆయన మళ్లీ ఛైర్మన్‌గా కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదన్న వార్తతో బుధవారం టాటా గ్రూప్‌ షేర్లలో భారీ అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో గ్రూప్‌లోని 17 లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ ఏకంగా రూ.68,119 కోట్లు ఆవిరైంది.

చంద్రశేఖరన్‌ నిర్ణయం వెలువడిన వెంటనే ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. టాటా గ్రూప్‌లోని కీలక కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా గత సెషన్‌లో దాదాపు రూ.27 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం మార్కెట్‌ విలువ.. బుధవారం రూ.26.32 లక్షల కోట్లకు పడిపోయింది.

ఈ పతనంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ముందుంది. కంపెనీ మార్కెట్‌ విలువ ఒక్కరోజులో రూ.42,440 కోట్లు తగ్గింది. షేరు 4.79 శాతం పడిపోయి రూ.2,323.30 వద్ద ముగిసింది.

టైటాన్‌ మార్కెట్‌ విలువ రూ.9,304 కోట్లు తగ్గింది. టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ రూ.4,898 కోట్లు, టాటా స్టీల్‌ రూ.4,745 కోట్లు కోల్పోయాయి. టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌, టాటా పవర్‌, ఇండియన్‌ హోటల్స్‌ కూడా నష్టపోయాయి.

అయితే అన్ని టాటా షేర్లూ పడిపోలేదు. టాటా మోటార్స్‌ మార్కెట్‌ విలువ రూ.1,786 కోట్లు పెరిగింది. టాటా క్యాపిటల్‌ రూ.700 కోట్లు, టాటా కెమికల్స్‌ రూ.167 కోట్లు, వోల్టాస్‌ రూ.66 కోట్లు తమ మార్కెట్‌ క్యాపిటల్‌కు జోడించాయి.

చంద్రశేఖరన్‌ తన పదవీకాలం ముగిసిన తర్వాత మళ్లీ ఛైర్మన్‌గా కొనసాగబోనని ప్రకటించారు. పునర్నియామకంపై ఏర్పడిన అనిశ్చితి నేపథ్యంలో వారసత్వ ప్రణాళికపై బోర్డు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement
N Chandrasekaran
Tata Sons Chairman
Tata Group stocks
TCS share price fall
Indian stock market news
Tata Group market value loss

More Telugu News